రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు శిక్షణా కార్యక్రమం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి తగిన మార్కెట్ సదుపాయాలను స్వయంగా కల్పించుకోవాలని నంద్యాల జిల్లా కె. ఆర్. డి. కార్తీక్, డి. డి. ఎం. రైతులకు సూచించారు. మంగళవారo నంద్యాల జిల్లా గడివేముల మండలంలో నవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ పి ఓ స్థాయిలో మార్కెటింగ్, బిజినెస్ పెరుగుదల, బోర్డు సభ్యుల విధులు బాధ్యతలు, రికార్డుల నిర్వహణపై రైతుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు రైతులకు పలు సూచనలు సలహాలు చేశారు. అలాగే మధ్య దళారీ వ్యవస్థను అరికట్టుకోవాలని, రైతులు కలిసికట్టుగా ఉండి తాము పండించిన పంటలను అమ్ముకొనుటకు మార్కెటింగ్ వ్యవస్థలను అందిపుచ్చుకొని తామే తమ పంటకు రేటును నిర్ణయించుకుని అమ్ముకునే స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆ సంస్థ సీఈవో ఆదినారాయణ పాల్గొని తమ శాఖ నుండి అందించే ఎరువులను రైతులు ఉపయోగించుకోవాలని, పండించిన పంట ఉత్పత్తులను గ్రేడింగ్ మరియు ప్రాసెసింగ్ చేయు పరికరాలను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవయూత్ అసోసియేషన్ సీఈవో నరసింహులు, గడివేముల ఎఫ్ పి ఓ సీఈవో అహ్మద్ రఫీ, అగ్రికల్చర్ స్పెషలిస్ట్ సత్య వర్ధన్, బోర్డు సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

