NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత

1 min read

– లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైసర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు, న్యూస్​ నేడు:  జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు  సబ్ జూనియర్స్,జూనియర్స్, సీనియర్స్ విభాగలలో“పర్యావరణ పరిరక్షణ – మన బాధ్యత” అనే అంశంపై వ్యాసరచన పోటీలను  ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కర్నూల్ రీజియన్ కార్యాలయం,జిల్లా న్యాయ సేవధికార సంస్థ, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ , భారత్ వికాస్ పరిషత్. ల సంయుక్త ఆధ్వర్యంలో   వెంకటరమణ కాలనీ లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యాలయ ఆవరాణలో  నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు మరియు అటవీ నిర్మూలన వల్ల కలుగుతున్న నష్టాలను వివరించారు.చెట్ల పెంపకం, నీటి సంరక్షణ మరియు ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ కె.డి.జె బాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరాన్ని వివరించారు.పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, నైస్ స్వచ్ఛంద సేవాసంస్థ కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *