పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాది కార సంస్థ, అధ్యక్షులు మరియు జిల్లా జడ్జి జి. కబర్థి, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సూచనల మేరకు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, కర్నూలు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జిల్లా కోర్ట్ ఆవరణలో మొక్కలను నాటారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని జడ్జి చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలని కోరారు. అలాగే ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణమును కాపాడాలని కోరారు.పిల్లలకు విద్యార్ధి దశలోనే పర్యావరణము పై అవగాహనా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ మెంబెర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి పవన్, న్యాయవాదులు, ప్యారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

