NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రామ కార్యదర్శి సుధాకర్

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  పంచాయతీ సెక్రెటరీ సుధాకర్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మద్దికేర మండలం, పెరవలి పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనపై వెళ్తుండగా తుగ్గలి పెరవలి మధ్య   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన పంచాయతీ సెక్రెటరీ సుధాకర్ ను 108 అంబులెన్స్ లో  పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

About Author