NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు పీహెచ్ సి  లో సాధారణ కాన్పు,తల్లి బిడ్డ క్షేమం

1 min read

గర్భిణీలకు పౌష్టిక ఆహారంతో పాటు మానసిక ప్రశాంతత అవసరం

ఏలూరు జిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు పీహెచ్ సి లో మంచి వైద్య సేవలతో పాటు. గర్భిణీ స్త్రీలకు సాధారణ కానుపులు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కాన్పు ను డాక్టర్:రాజశేఖర్ సిబ్బంది సహాయంతో నిర్వహించారు.బాబు బరువుతో మూడు కేజీల బరువు కలిగి పుట్టటం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని.తల్లిదండ్రులు బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారంతో పాటు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. ప్రతి నెల వైద్య సిబ్బంది సూచనలు సలహాలు  పాటిస్తే ఇటువంటి నార్మల్(సాధారణ) డెలివరీలు సాధ్యపడతాయని డాక్టర్: రాజశేఖర్ అన్నారు.

About Author