దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలి
1 min read
నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె.వరప్రసాదరావు
న్యూఢిల్లీలో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కలిసి వినతి పత్రం
ఏలూరుజిల్లా ప్రతినిధి,పల్లె వాణి: దళిత క్రిస్టియన్లను షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె.వరప్రసాదరావు న్యాయవాది ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్ సి కులాల వారు చర్చికి వెళ్తుంటే ఎస్సీ హోదా కోల్పోతున్నారు అంటూ మత స్వేచ్ఛ హక్కుల రక్షణ ప్రాథమిక హక్కుని మాకు కల్పించాలని 500 పేజీల వినతి పత్రం 1994 నుంచి మేము చేస్తున్న ఉద్యమాన్ని ప్రెస్ క్లిప్స్ జీవోలు ఇవన్నీ జతపరచి ఇవ్వటం జరిగింది. అనంతరం కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్రామ్ దాస్ అత్వలే ని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది అదేవిధంగా జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ ఏదైతే దళిత క్రైస్తవు లు క్రిస్టియన్ చర్చికి వెళ్లిన వాళ్ల స్థితిగతులు పరిస్థితులు ప్రభావం మారలేదని అనుకూలంగా ఇచ్చిందో ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం రికమెండ్ చేయాలని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని బాలకృష్ణ కి నివేదిగించడం జరిగింది బాలకృష్ణ ని కలిసిన రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ 45 కోట్ల మంది దళిత క్రైస్తవ ముస్లింలకు మత స్వేచ్ఛను రద్దు చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 రాజ్యాంగ విరుద్ధమని దానిని వెంటనే రద్దు చేయడం లేదా సవరించడం చేసి దళిత సిక్కులకు బుద్ధిష్టులకు ఎస్సీ హోదా కనిపించినట్లే దళిత క్రైస్తవ ముస్లింలకు కూడా కల్పించాలని లేకపోతే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము దళిత క్రైస్తవులని ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చర్చిలను పడగొట్టడమే కాకుండా దళిత క్రైస్తవులను అడుగడుగున అవమానిస్తూ అణిచివేస్తున్నాడని ఆయనను ఆ పదవి నుండి తొలగించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దళిత క్రైస్తవుల జోలికి వస్తే వారి ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని ఆ దిశగా అమరావతిలో లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ దళిత జేఏసీ న్యూఢిల్లీ ప్రెసిడెంట్ మార్టిన్,ఏపీ సెక్రటరీ వి.కె రమేష్ పాల్గొన్నారు.


