వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యల వల్లే గొడవలు
1 min read
నేనే గొడవలు వద్దు అని చెప్పా
నా దృష్టి నియోజకవర్గ అభివృద్ధిపైనే
మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలు వల్లే గొడవలు జరిగాయని మంత్రాలయం టిడిపి ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరం లోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోసిగిలో జరుగిన చంద్రబాబు వెన్ను పోటు కు రెండేళ్లు కార్యక్రమానికి వైకాపా నాయకులు , కార్యకర్తలు వెళ్ళుతూ నా ఇంటి ముందు ఇలలు, కేకలు బాణాసంచలు కాలుస్తూ, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు . అయినా నా కుటుంబ సభ్యులు అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చేటప్పుడు కూడా అలాగే ప్రవర్తించడం వల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగరెడ్డి గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గ్రామాలలో గలాటాలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు . సీఎం రెండేళ్ల పరిపాలన విజయోత్సవం కార్యక్రమంలో ఉన్నాను. ఈ విషయం తెలిసిన వెంటనే నా కుటుంబ సభ్యులకు సమన్వయం పాటించాలని కోరానన్నారు . ఎన్నికల సమయంలో బోయలను గెలిపిస్తే గ్రామాలలో దౌర్జన్యాలు , రాక్షస పాలన ఉంటాయని ఎమ్మెల్యే నాపై ఆరోపణలు చేశారు. నా ప్రభుత్వం వచ్చే రెండేళ్లయిన ఎక్కడ గొడవలో సృష్టించిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపాల్ రెడ్డి , చావడి వెంకటేష్ ముత్తిరెడ్డి పవన్ కుమార్ , జ్ఞానేష్ అయ్యన్న .


