పల్లెల్లో డంప్ యార్డుల్లా తలపిస్తున్న చెత్తాచెదారం
1 min read
ఇలాగైతే రోగాలు రావా.? -సీపీఐ ఎంఎల్ పార్టీ వెంకటేశ్వర్లు..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: గ్రామాల్లోనే చెత్తాచెదారం వల్ల యార్డుల్లా తలపిస్తున్నాయని వీటి దుర్వాసన వల్ల ప్రజలకు రోగాలు రావా అని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు అధికారులపై అసహన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న చెత్తాచెదారాన్ని శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తాచెదారం అధికంగా ఉన్నాయని వీటివల్ల దుర్వాసన వెదజల్లుతోందని ఈ దుర్వాసన వల్ల మలేరియా,డెంగ్యూ తదితర విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు.గ్రామాల సర్పంచుల పదవీకాలం పూర్తి అయిన తర్వాత శానిటేషన్ చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారుల కళ్ళకు కనపడుతున్నా తెలియనట్లు ఉండటం మంచిది కాదని గ్రామాల ప్రజలకు రోగాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులపై మండిపడ్డారు. గ్రామాల్లో కాకుండా గ్రామానికి దూరంలో చెత్త చెదారం వేయాలని అలా కాకుండా గ్రామాల్లో వేస్తున్నారని వెంటనే మండల జిల్లా అధికారులు స్పందించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చెత్తా చెదారాన్ని తొలగించి శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సోమన్న,ఎం.నాగేశ్వరరావు, మహిళా సంఘం జిల్లా నాయకురాలు నవ్యసానీ,నూర్జహాన్,శిరీష పాల్గొన్నారు.


