విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు
1 min read
చోద్యం చూస్తున్న రవాణా శాఖ విద్యాశాఖ అధికారులు.. చర్యలు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్.
అమలాపురం, న్యూస్ నేడు : ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చర్యలు తీసుకోవలసిన విద్యాశాఖ మరియు ఆర్టీవో అధికారులు కాసుల వేటలో (మామూళ్ల మత్తులో) మునుగు తేలుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం పొలమూరి మోహన్ బాబు జిల్లా అధికారులపై మండిపడ్డారు. స్కూళ్లు తెరిచిన మరుక్షణమే (రోజునే ప్రైవేట్ విద్యా సంస్థ అయిన శ్రీ చైతన్య) స్కూల్ బస్సు యొక్క ఎమర్జెన్సీ డోర్ పడిపోవడం. రోడ్డు మధ్యంగా ఆగిపోవడం అమలాపురం ముఖ్య పట్టణంలో జరిగింది. స్కూలు తెరిచే నాటికి అన్ని బస్సులు ఫిట్ నెస్ చెక్ చేయవలసిన రవాణా శాఖ అధికారులు పట్టించుకోకుండా లే లేత వయసు పసిపిల్లల ప్రాణాలతో ఆటలాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. గౌరవ జిల్లా కలెక్టర్ ఈరోజు జరిగిన విషయమై అన్ని ప్రైవేటు స్కూల్స్ మరియు కళాశాల బస్సులను నాణ్యత ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను గుర్తింపును రద్దు చేయాలని…. గౌరవ కలెక్టర్ కోరారు. . కాలం చెల్లిన బస్సులను నిలిపివేయాలి .నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలల/స్కూల్స్ గుర్తింపును రద్దు చేయాలి .అన్ని స్కూలు/ కాలేజీ బస్సులకు ఫిట్నెస్ టెస్టులు మంత్లీ వారీగా చెక్ చేయాలి.పొలమూరి మోహన్ బాబు బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటున్నారు.


