NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండేళ్ల పాలనలో..అభివృద్ధి సంక్షేమం

1 min read

రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా కృషి

ఏడాది చివరిలోపు మిడుతూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు

‘రెండేళ్ల పాలన’లో ఎమ్మెల్యే..మాండ్ర

నందికొట్కూరు న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని నందికొట్కూరు పట్టణంలో శాశ్వతంగా అభివృద్ధి పనులుఉండే విధంగా కృషి చేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన’రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన’అభివృద్ధిపై నియోజకవర్గ స్థాయిలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యవర్గ సభ్యులు మాండ్ర శివానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రెండు కోట్లతో డ్రైనేజీ పనులు శాశ్వతంగా ఉండేందుకు కృషి చేస్తున్నామని అదేవిధంగా పట్టణంలో ఉన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను కృషి చేస్తున్నామని అన్నారు. 2019-2024 వరకు గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.దళితులు మైనారిటీలు బీసీలపై ఆనాటి ప్రభుత్వం దాడులు చేసిందని 14 వేల కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్ని విధాలుగా పట్టణం మరియు గ్రామాలను అభివృద్ధి వైపు తీసుకు వెళ్తున్నామని మారుతీ నగర్,బిఆర్ఆర్ నగర్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ ఏడాది చివరిలోపు మిడుతూర్ లిఫ్ట్ ఇరిగేషన్

ఈ ఏడాది చివరిలోపు మిడుతూరు ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించేందుకు నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని మాండ్ర శివానందరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 625 స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులను మహిళలకు ఎమ్మెల్యే..శివానందరెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ,బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జాకీర్ హుస్సేన్, చింతామణి,ఆత్మకూరు ఆర్డీవో సి వెంకట శివ, మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు వెంకట శివుడు యాదవ్,గ్రామ మరియు వివిధ మండల స్థాయి అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *