రోడ్డు ప్రమాదాల్లో ఒకరి నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది
1 min read
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వాహనదారులు భద్రతా నియమాలు తప్పని సరిగా పాటించాలని, ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని, ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరి కుటుంబం రోడ్డున పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండడం, హెల్మెట్ సీట్ బెల్ట్ లు ధరించి ప్రభుత్వ నియమాలు పాటిస్తూ ప్రయాణాలు చేయడం ఎంతో ఉత్తమమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో దెందులూరు నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతున్న డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో భాగంగా పెదవేగి మండలంలోని పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన డ్రైవింగ్ లైసెన్సుల అవగాహన సదస్సు కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా డ్రైవింగ్ లైసెన్సులకు అప్లై చేసిన వారికి రవాణా శాఖ అధికారులుచే కేటాయించబడిన స్లాట్ తేదీ కేటాయింపు ఉత్తర్వులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా అప్లై చేసిన వారికి అందజేశారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలను రహదారి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను రవాణా శాఖ అధికారులు ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ కరీం, పెదవేగి ఎంపీడీవో నాగేంద్ర,పిఆర్ఐ డిఇ శ్రీనివాసరావు సహా పలువురు కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

