NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జవహర్ విజ్ఞాన కేంద్రం దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహణ

1 min read

ఉద్యోగాలకి మొత్తం 68 మంది విద్యార్థులు పాల్గొనగా,44 మంది షార్ట్ లిస్ట్

కళాశాల ప్రిన్సిపాల్ డా:జి.గిరిబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరు లోని జవహర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించటం జరిగినది. ఈ ఉద్యోగాలకి బి.యస్సీ (కెమిస్ట్రీ),ఎం.యస్సీ(ఆర్గానిక్, అనలిటికల్,మైక్రోబయాలజీ) , బి.టెక్ (మెకానికల్, కెమికల్) , బి.ఫార్మసీ,ఎం.ఫార్మసీ విద్యార్హతతో ఇంటర్వ్యూ లు నిర్వహించారు. మొత్తం 68 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 44 మంది షార్ట్ లిస్ట్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలియచేశారని కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.గిరిబాబు అన్నారు.ఉప ప్రధాన చార్యుడు అజయ్ కుమార్,జేకేసీ కోఆర్డినేటర్ వి.వెంకటరావు,జేకేసీ మెంటార్ రాంబాబు తదితరులు  పాల్గొన్నారు.

About Author