రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
1 min read
వ్యవసాయ అధికారులతో ఈబీజీ గోవింద్ గౌడ్ సమీక్ష
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఈబీజీ గోవింద్ గౌడ్
హొళగుందన్యూస్ నేడు: రైతులకు యూరియా ఎరువుల కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. బుధవారం హొళగుంద వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, వ్యవసాయ అధికారి (ఏఓ)తో సమావేశమై మండలంలోని యూరియా నిల్వలు, పంపిణీ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాగు సీజన్‌లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన యూరియా, ఇతర ఎరువులు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, ఎరువుల కొరత లేకుండా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను కోరారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పంపతి, యారిస్వామి, డీడీ వెంకటేష్, రారాయి సిద్ధు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

