NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నషాముక్త్ భారత అభియాన్ కార్యక్రమం

1 min read

ఏలూరు జిల్లాలోని ఆశ్రం మెడికల్ కళాశాలలో  క్రికేట్ క్రీడా పోటీల నిర్వహణ

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నషాముక్త్ భారత అభియాన్ కార్యక్రమమును ఏలూరు జిల్లాలోని ఆశ్రం మెడికల్ కళాశాలలో  క్రీడా ప్రాంగణము నందు   జిల్లా కలక్టర్  అదేశముల మేరకు క్రికేట్ క్రీడా పోటీల నిర్వహించినట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. రామ్ కుమార్ చెప్పారు. నషాముక్త్ భారత అభియాన్ కార్యక్రమములో భాగంగా   ఏలూరు జిల్లాలోని ఆశ్రం మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణము లో  ఈనెల 24, 25 తేదీలలో  జిల్లా లోని ప్రభుత్వ శాఖలలో పనిచేసే సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, పాత్రికేయుల మధ్య  క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించుట జరుగుతున్నదన్నారు.సదరు క్రీడా పోటీలలో జిల్లా రెవెన్యూ టీమ్, పోలిస్ టీమ్, ప్రెస్ టీమ్, అగ్రికల్చర్ టీమ్, స్వర్ణ గ్రామ వార్డ్ సచివాలయం టీమ్ (GSWS), ఎడ్యుకేషన్ టీమ్, గృహనిర్మాణ శాఖ టీమ్, పంచాయితీరాజ్ టీమ్ మొత్తం 8 శాఖల టీమ్.లు పాల్గొనుట జరిగినదని, మొదటి రౌండ్ నందు రెవెన్యూ, పోలిస్,  స్వర్ణ గ్రామ వార్డ్ సచివాలయం మరియు అగ్రికల్చర్ టీంలు విజేతలుగా నిలిచారన్నారు.రెవెన్యూ టీమ్.కు  ట్రైనీ కలక్టర్, సిహ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,   కెప్టన్.గా వ్యవహరించారని రామ్ కుమార్ తెలియజేసారు.

About Author