కానూరులో టీడీపీ స్థూపం ధ్వంసం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
1 min read
పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం,తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు రంగబొమ్మ సెంటర్లో దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా స్థూపాన్ని ధ్వంసం చేయడంపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ధ్వంసమైన జెండా దిమ్మె స్థానంలో వెంటనే నూతన జెండా దిమ్మె నిర్మించి పార్టీ జెండాను ఆవిష్కరించారు,ఈ సందర్భంగా కార్యకర్తలకు ధైర్యం చెబుతూ,పార్టీ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ,కానూరులో తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న టీడీపీ జెండా స్థూపాన్ని కూల్చివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.కానూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నారని,అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు,రాజకీయ విభేదాలు ఉన్నా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమన్నారు…పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, అయితే పార్టీ ఆత్మగౌరవం దెబ్బతినే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు,ధ్వంసం చేసిన చోట తిరిగి జెండా దిమ్మెను నిర్మించడం ద్వారా కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కల్పించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

