NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారిశ్రామికవేత్తలు సమస్యల పరిష్కారం కోసం మెగా పారిశ్రామికవేత్తల సదస్సు

1 min read

ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

 అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో పారిశ్రామికవేత్తలకు సన్మానం

ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారం కోసం జులై నెలలో మెగా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పలువురు పారిశ్రామికవేత్తలను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలందరికీ అంతర్జాతీయ ఎంఎ స్ఎంఈ దినోత్సవ శుభాకాంక్షలను కలెక్టర్  తెలియజేసారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ   జిల్లా జిడిపి అభివృద్ధిలో పారిశ్రామికాభివృద్ధి ఎంతో కీలకమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, యువతకు ఉపాధికల్పన, తదితర అంశాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.  పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సూచికలో జిల్లా ముందుస్థానంలో ఉండడంతోపాటు జిల్లాలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.  పారిశ్రామికవేత్తలు ఎదుర్కునే సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.   పారిశ్రామికవేత్తలకు, ఎంఎ స్ఎంఈలకు ఎదురయ్యే రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవవనరులు, తదితర ఎన్నో సమస్యలను ఉంటాయని వాటిని తెలుసుకుని  త్వరితగతిన పరిష్కరించేందుకు జులై నెలలో జిల్లాలో పెద్దఎత్తున ‘మెగా ఇండస్ట్రీస్ మీట్’ ఏర్పాటుచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంఎస్ఎంఈ లకు పరిశ్రమల ఏర్పాటులో జిల్లా యంత్రాంగం సింగల్ విండో పధకం కింద నిర్దేశించిన సమయంలోనే అనుమతులు మంజూరు చేస్తూ, యూనిట్ల స్థాపనలో వారికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తున్నదన్నారు.ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ఎన్నో సానుకూల చర్యలు  తీసుకుంటున్నారని, దీనికరణంగా జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి పధంలో ప్రయానిస్తున్నదన్నారు.  జిల్లాలోని పలు పరిశ్రమలలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉన్నదని కలెక్టర్ కు తెలియజేసారు. ఈ విషయంపై కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ పారిశ్రామికవేత్తలు తమకు ఏ విభాగంలో నైపుణ్యం కలిగిన మానవవనరులు అవసరమో తెలియజేస్తే, అటువంటి వారిని గుర్తించి, వారికీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సదరు విభాగాలలో శిక్షణ అందిస్తామని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.   ఈ సందర్భంగా జిల్లా పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలు  వంకినేని కిరణ్ కుమార్,, గుత్తా సాయి సత్య వరప్రసాద్, సొంకర్ సోనీ, బి.ఎస్. రెడ్డి, చెరుకూరి యేసుపాదం, ద్వారకాతిరుమల చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు మరియు  మహిళా పారిశ్రామికవేత్త సరస్వతి లను దుశ్శాలువా, మెమెంటోలతో కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకటరావు, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి,  పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ట్రాన్స్కో ఎస్ఈ బి.ఎం. అంబేద్కర్ , వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా,  స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జితేంద్ర, కార్మిక శాఖ సహాయ కమీషనర్ నాగేశ్వరరావు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు జిల్లా కలెక్టర్ ను దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *