పల్లెలప్రగతికి రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) పథకం
1 min read
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి,సంక్షేమ కార్యక్రమం
ప్రారంభించిన ఏలూరు ఎంపిడివో జనార్దన్,డిప్యూటీ ఎంపిడివో చింతమనేని విష్ణు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మండలం ఆశ్రమం సమీపంలోని ఆటోనగర్ వద్ద వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) విబి జైరాంజీ} అమలు కార్యక్రమాన్ని ఏలూరు ఎంపిడివో జనార్దన్, డిప్యూటీ ఎంపిడివో చింతమనేని విష్ణు,
టీడీపీ ఏలూరు మండల అధ్యక్షులు నేతల రవి లు
ఫీడర్ ఛానల్ పనులను గుణపంతో త్రవ్వి , భూమి పూజలు చేసి, లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడివో జనార్దన్ మాట్లాడుతూ వికసిత భారత్ -2047 కలను సాకరం చేసేందుకు ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలనన్నారు. రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) పథకం పల్లెసీమలు ప్రగతికి ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) లేదా అనేది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి, సంక్షేమ కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్ట బద్ధమైన హామీని ఇస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబానికి 125 రోజులు పాటు ఉపాధి కల్పిస్తారని, వ్యవసాయ పనులు సమయంలో ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు ప్రకటన ద్వారా 60 రోజులు పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు. మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు ఉపాధి హామీ అందుబాటులో ఉంటుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యనిధులు వాటా 60:40 నిష్పత్తిలో ఉంటుందని అన్నారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం దీనిలో ఒక ముఖ్యమైన భాగం అని, సాంకేతికత, పారదర్శకత కోసం సోషల్ ఆడిట్‌ను, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంతో పాటు, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే (వికసిత్ భారత్ 2047) లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ప్రజలు, గ్రామాలు ఆస్తులు సృష్టి జరుగుతుందని అన్నారు .కార్యక్రమంలో తెదేహ నాయకులు సత్యనారాయణ, కొట్టే సుబ్బారావు, నల్లమెల్లి పరదేశ్ కుమార్, ఏపీవో మోహిని కుమారి,ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్య, ఈసీ రమేష్ , టి.ఏ అనిల్ లు పాల్గొన్నారు.

