NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పి ఆర్ సి కమిటీ మరియు ఐ ఆర్ ప్రకటించాలని  జూలై 14 న ర్యాలీ

1 min read

జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం – ఫ్యాప్టో

కర్నూలు, న్యూస్​ నేడు:  నేటి సాయంత్రం జిల్లా యు టి ఎఫ్ కార్యాలయం లో కర్నూలు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్ రావు  నాయకత్వం లో జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లో రాక ముందు ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాం అని చెప్పారు. కానీ అధికారం లో వచ్చి రెండు సంవత్సరాల కాలం దాటి పోయిన ఇంత వరకు పి ఆర్ సి కమిటీ నియమించ లేదు ఐ ఆర్ ప్రస్తావన లేదు , అందుకే రాష్ట్ర ఫ్యాప్టో అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా లోని ఉపాధ్యాయులు అందరు 14 తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలి అని పిలుపు ఇచ్చారు.కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ ఎం మధుసూదన్ రెడ్డి గారు ఫ్యాప్టో నిరసన కార్యక్రమం లో మూడు ముఖ్యమైన డిమాండ్లను పెట్టడం జరిగింది 12 వ పి ఆర్ సి ప్రకటించాలి,30 శాతం ఐ ఆర్ ప్రకటించాలని,4 పెండింగ్ డి ఎ లను ప్రకటించాలి, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని ఈ కార్యక్రమం ప్రకటించడం జరిగింది అని చెప్పారు. ఫ్యాప్టో కర్నూలు జిల్లా సెక్రటరీ జనరల్ జి భాస్కర్ గారు మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమం లో కలిసి వచ్చే అన్ని ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాల ను ఈ కార్యక్రమం ను ఆహ్వానిస్తున్నాం అని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో లో యు టి ఎఫ్ అధ్యక్షుడు రవి కుమార్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అర్ధిక అంశాలు పై అసంతృప్తి తో ఉన్నారు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం లో అందరూ పాల్గొనాలి కోరారు. ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావలసిన సరెండర్ లీవ్ లు గత కొన్ని సంవత్సరాలు గా పెండింగ్ లో ఉన్నాయని నిరసన విజయవంతం చేయాలి అని కోరారు. ఎ పి టి ఎఫ్ 257 జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాసింజి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీ జీతం తో సరి పెట్టుకుందని ఇతర అర్ధిక అంశాలు పట్టించుకోవడం లేదు.ఈ నిరసన కార్యక్రమం ను విజయవంతంగా చేయాలని కోరారు. ఎ పి టి ఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షలు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం లు చేసిన పట్టించుకొని ప్రభుత్వం ను పట్టించుకొనని ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఉండాలని అని అన్నారు. ప్రధానోపాధ్యాయ సంఘము జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ జిల్లా లోని అన్ని సంఘాలు కలిసి వచ్చి జూలై 14 వ తేదీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం లో పాల్గొనాలి అని కోరారు. డి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమన్న మాట్లాడుతూ 14 వ తేదీ ఉదయం 9 గంటలకు అంతా కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కు చేరుకోవాలి అని కోరారు.ఈ సమావేశం యందు నవీన్ పాటిల్ ( యు టి ఎఫ్), వెంకట్రాముడు (ఎస్ టి యు), మరియానందం (ఎ పి టి ఎఫ్ 1938) పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *