NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటి గిరిజన విద్యార్థి రఘు నాయక్ కు సన్మానం

1 min read

732 వ ర్యాంకు సాధించిన గిరిజన విద్యార్థి రఘు నాయక్ ను ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు పి వెంకటప్ప

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెరువు తాండ గ్రామానికి చెందిన ఒక నిరుపేద గిరిజన విద్యార్థి రఘునాయక్ గారిని ఈరోజు తుగ్గలి మండలం చెరువు తండా గ్రామంలో జేఈఈ మెయిన్స్ 732వ ర్యాంకు సాధించిన గిరిజన విద్యార్థిని ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు పి వెంకటప్ప  ఘనంగా సన్మానించడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబంలో ఒక గిరిజన బిడ్డగా ఒక మారుమూల ప్రాంతంలో చదివి మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి గిరిజన ప్రాంతానికి గిరిజన గుడానికి వారి తల్లిదండ్రులకు మరియు మంచి పేరు తీసుకుని రావాలని భవిష్యత్తులో కూడా విద్యార్థికి మరియు తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎస్టి కమిషన్ అండగా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరిచంద్రప్ప గిరిజన సంఘాల నాయకులు ఈశ్వరయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *