రచ్చమరి లో ఏరువాక పౌర్ణమి వేడుకలు
1 min read
వృషభాల పారువేట తో రైతుల్లో ఆనందం
మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మహిళలు, యువతులు పిల్లలు ఉదయం నుండి అమ్మవార్లు కొలువైన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వృషభాల ను స్నానాలు చేయించి వివిధ రకాల రంగులతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం బంగారమ్మ దేవాలయం దగ్గర వృషభాల పారువేట నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాధవరం ఎస్సై విజయ కుమార్ అధ్వర్యంలో తన పోలీసు సిబ్బంది తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డీలర్ తిమ్మప్ప, పోలి శివ, పోలి వీరేష్, హుసేని, ఈరన్న, వెంకటేష్, బండ్రాళ్ళ నరసింహులు, వైకాపా నాయకులు రోగప్ప, బొజ్జప్ప, జట్టి వీరేష్, నర్సిరెడ్డి, లక్ష్మయ్య, నాగేష్, ఈరన్న, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

