ప్రజలకిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం
1 min read
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి
ఐదేళ్ళు దోపిడీయే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందంటూ ఆయన ధ్వజమెత్తారు
20వ డివిజన్ మినీ బైపాస్ రోడ్డులో సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరుకు ఆయన ప్రత్యేక పూజలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజలకిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధినేతలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. గత ఐదేళ్ళు దోపిడీయే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఏలూరు 20వ డివిజన్ మినీ బైపాస్ రోడ్డులోని గ్రీన్‌సిటీ ఎదురుగా మురుగుతూముల వద్ద సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరుకు ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మోటారు స్విచ్ ఆన్ చేశారు. ఇదేసమయంలో స్థానిక ప్రజలిచ్చిన ఆతిథ్యాన్ని ఎమ్మెల్యే చంటి గౌరవ పూర్వకంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో చెత్తకు కూడా పన్ను వేసిన దౌర్భాగ్య పరిస్థితులను ప్రజలెవ్వరూ మర్చిపోరంటూ ధ్వజమెత్తారు. అటువంటి దోపిడీ విధానాలకు స్వస్థి పలికి ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే కూటమి ప్రభుత్వాధినేతలు లక్ష్యసాధన దిశగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ గూడూరు ప్రసాద్, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇంచార్జ్ కప్పా ఉమామహేశ్వరరావు, కో-ఇంచార్జ్ ఆకుల ప్రసాద్, సెక్రటరీ మీసాల సత్తిబాబు, కూటమి నాయకులు మీసాల రాంబాబు, రేగాడి వెంకటేశ్వరరావు, నెల్లి మురళి మోహన్, కస్తూరి సాయి తేజస్విని, పిల్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు.


