కార్యకర్తలకు అండగా ఉంటాం.. మాజీ ఎమ్మెల్యే గంగుల
1 min read
కాలనీలోనికి ఆహ్వానిస్తున్న వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు
చాగలమర్రి రూరల్,( న్యూస్ నేడు): కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించుటకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వైసిపి కార్యకర్త సుబ్బరాయుడు, మరి కొంతమంది ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలలోని పేదలకు చేసిన సంక్షేమ పథకాల గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి ప్రజలు మరిచిపోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో రాజన్న రాజ్యం రాక తప్పదని ఆయన జోష్యం చెప్పారు. గంగుల వెంట వైసీపీ రాష్ట్ర మైనారిటీ విభాగ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, వివిధ గ్రామ నాయకులు, కార్యకర్తలు, గంగుల అభిమానులు ఉన్నారు.

