NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీమోక్ష రామచంద్ర స్వామి దేవస్థానం నందు తి.తి.దే. ధార్మిక కార్యక్రమాలు

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు: నంద్యాల పట్టణం, బాల్కొండ హాల్ వద్ద ఉన్న శ్రీ మోక్షరామచంద్ర స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 7వ తేదీ నుండి మూడు రోజులు ప్రముఖ ధార్మిక ప్రవచకులు, సంస్కృత పండితులు, భక్తిఛానల్ వ్యాఖ్యాత డాక్టర్ దివి హయగ్రీవాచార్యులచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించిన కరపత్రాలను స్థానిక భక్తసమాజంచే ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు డి.మధు సుధన్ రావు, డి.రాంప్రసాద్, వీరన్న, రామ్మూర్తి, శ్రీనివాసులు, పవన్ కుమార్, శంతన్, మనోజ్, నవనీత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని విజ్ఞప్తి చేశారు.

About Author