ప్రభుత్వానికి -ప్రజలకు వారధిలా సమాచార శాఖ బాధ్యతగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి
1 min read
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని, మర్యాదపూర్వకంగా కలిసి నూతన డిపిఆర్వో సి.హెచ్. కనకదుర్గ ప్రసాదు లింగం
పూలమొక్కను అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని, మర్యాదపూర్వకంగా కలిసి పదోన్నతి పొంది విధుల్లో జాయిను అయిన డిపిఆర్వో సి.హెచ్.కనక దుర్గప్రసాదు లింగం పూలమొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సంబంధాలు శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలు మరింత వేగవంతం చెయ్యాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సమాచారాన్ని మరింత సమర్థవంతంగా చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలు వివరాలు, సమాచారాన్ని పారదర్శకంగా, వేగవంతంగా చేరవేసేందుకు ప్రజా సంబంధాలు శాఖ సమర్థవంతంగా కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. మారుతున్న కాలాన్ని అనుగుణంగా సోషల్ మీడియాను వినియోగించాలని అన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, సమాచార శాఖ బాధ్యతలను మరింత సమర్థంగా పనిచేసి అందరి మన్ననలు పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు.సురేంద్రనాథ్, ఏవిఎస్ సి.హెచ్.శ్రీనివాస నెహ్రూ, ఫోటో గ్రాఫరు పత్తి సాగర్, వీడియో గ్రాఫర్ వి.సంధ్యకమల, తదితరులు పాల్గొన్నారు.


