ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాది
1 min read
ముద్దాయిలతో ముఖాముఖి -సబ్ జైల్ ను తనిఖీ చేసిన సెక్రటరీ,సీనియర్ సివిల్ జడ్జి..
నందికొట్కూరు న్యూస్ నేడు: ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదని ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి బి లీలా వెంకట శేషాద్రి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు సబ్ జైల్ ను ఆకస్మికంగా తనఖీ చేశారు. కారాగారంలో ఉన్న ముద్దాయిలతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.న్యాయ సేవలు మరియు వాటి విలువలను గురించి వివరిస్తూ అందరికీ న్యాయ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.ముద్దాయిల కేసుల వివరాలను సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని నియమించుకోలేని ముద్దాయి లకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు.జైలులోని ముద్దాయిలలో 70 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ముద్దాయిలు ఉన్నారా అని అడిగారు. అనంతరం జైల్లోని లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సందర్శించారు.ఈ క్లినిక్ ల ద్వారా ఉచితంగా న్యాయ సేవలు,సలహాలను తెలుసుకోవచ్చని సమస్యల కోసం ఉచిత న్యాయవాది ద్వారా కానీ లేదా ఆన్లైన్ ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 15100 ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చన్నారు.తర్వాత జైలు పరిసర ప్రాంతాలను మరియు భోజన వసతులు,వైద్య సదుపాయాల గురించి జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు.స్థానిక కోర్టు ఆవరణంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి రాబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని పోలీసులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైలు ఇన్చార్జి అధికారి ఏ.శ్రీనివాసులు, ప్యానల్ న్యాయవాదులు కె.వెంకటేశ్వర్లు,లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం ప్యానల్ న్యాయవాది శివ రామచంద్రారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

