పీడీ రవికుమార్ ను పరామర్శించిన సిద్దార్థ రెడ్డి
1 min read
కార్యకర్త కుటుంబానికి 5 వేలు అందజేత..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రవికుమార్ అనారోగ్య కారణంగా కర్నూలులో గౌరి గోపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి రవికుమార్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా ఆరోగ్యంతో కోలుకోవాలని అలాగే ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్ కు చెందిన చాకలి సంజన్న మరణించడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్,ఓంకార్ రెడ్డి, నాయబ్,మార్కెట్ రాజు సంజన్న మృతదేహానికి నివాళులు అర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయల నగదును అందజేశారు.సిద్ధార్థ రెడ్డి వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి పాల్గొన్నారు.

