NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“రైతులకు సేంద్రియ ఎరువులు .. చిరుధాన్యాల సాగు పైన” అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సహకార వారోత్సవాల సందర్భంగా 06.07.2026న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయము భవనమునందు సహకార వారోత్సవాల సందర్భంగా “రైతులకు సేంద్రియ ఎరువులు మరియు చిరుధాన్యాల సాగు పైన” అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ప్రకృతి వ్యవసాయ జిల్లా కన్సల్టెంట్ లక్షయ్య మరియు సాంకేతిక నిపుణులు శ్రీ వంశీకృష్ణ  ఈ సందర్భంగా మాట్లాడుతూ, సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నేల సారవంతగా పెరిగి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. అలాగే చిరుధాన్యాల సాగు తక్కువ నీటితో అధిక దిగుబడిని అందించడంతో పాటు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని వివరించారు.సాంకేతిక నిపుణులు శ్రీ వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులు ఎల్నినో దృష్ట్యా ప్రతికూల పరిస్థితులను ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలి అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. పలు పంటల విధానం అయినటువంటి పి. ఎం.డి. ఎస్. A గ్రేడ్ మోడల్, ఏటిఎం మోడల్, పెరటి తోట ద్వారా రైతులు మెరుగైన దిగుబడి పొందవచ్చు అని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్ధతుల ద్వారా పంటలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తెలియజేశారు. చిరు ధాన్యాల ద్వారా వర్ష భావ పరిస్థితుల్లో కూడా పంటలు సాగు చేయవచ్చు అని తెలియజేశారు. ఆ తర్వాత రైతులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.ఈ కార్యక్రమమునకు బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి (ఇంచార్జి) శ్రీ సి. హెచ్. ఆర్.సి.ఎస్. బాలాజీ రావు , కర్నూలు, జిల్లా సహకార అధికారి శ్రీమతి ఐ.డి. శీరీష  మరియు డి.ఆర్ / ఓ.ఎస్.డి. శ్రీమతి బి. చెన్నెమ్మ, బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ పి. రామాంజనేయులు , డి.జి.ఎమ్.లు  కె. ఉమామహేశ్వర రెడ్డి , శ్రీ బి. సునీల్ కుమార్  మరియు  బి.వి. నాగిరెడ్డి , ఎ.జి. ఎమ్.లు శ్రీమతి ఇ. గీత , శ్రీమతి కె. సరోజమ్మ   పి. రాఘవేంద్ర మరియు బ్యాంకు సిబ్బందితోపాటు పసుపుల, ఉల్పాల మరియు కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల సి.ఇ.ఓ.లు మరియు రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *