విద్యార్థినుల చదువుకు ఆర్థిక చేయూత అందించిన టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ
1 min read
అభినందించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉన్నత విద్యాభ్యాసం ద్వారా భావి తరాలకు మార్గదర్శులు అవ్వుతారని వారి చదువును కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు దాకారపు కృష్ణ చింతలపూడి సుప్రియన్ పేట కాలనీకి చెందిన తిరువీధుల సిద్దెమ్మ మరియు పింగుల ప్రసన్న కుమారిలకు వారి విద్యాభ్యాసం నిమిత్తం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు.ఈ సందర్భంగా విద్యార్థినుల విద్యాభివృద్ధికి చేయూతనిచ్చిన దాకారపు కృష్ణ సేవాభావాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అభినందించారు. సమాజంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొంటూ,వారి చదువుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.

