74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కళాశాల ప్రిన్సిపాల్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కళాశాల స్థాపన అనేది కేవలం ఒక విద్యాసంస్థ ఆవిర్భావం మాత్రమే కాక, విలువలతో కూడిన విద్యా సంప్రదాయానికి ఆది శిలగా నిలిచిన మహత్తర ఘట్టం. ఈ పవిత్ర ప్రయాణానికి పునాది వేసిన సెయింట్ ఆన్స్ ప్రొవిన్స్ మరియు దాతృత్వం, దూరదృష్టి కలిగిన కార్లో జూలియా దంపతుల సేవలను ఈ సందర్భంలో కృతజ్ఞతాభివందనాలతో స్మరించుకోవడం మన బాధ్యతగా భావిస్తున్నాను అన్నారు డా . సిస్టర్ సునీలా రాణి పూదోట. స్థానిక సెయింట్ థెరిసా మహిళా (స్వయం ప్రతిపత్తి )కళాశాలలో జరిగిన 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ సునీలా రాణి పూదోట , పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను విద్యారంగంలో రాణింపజేసి మహిళా సాధికారత వైపు నడిపించడానికి తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నదని తెలియజేశారు. ఈ కళాశాల అభివృద్ధి పథంలోఎందరో పూర్వపు కరస్పాండెంట్లు ప్రధానాధ్యాపకులు తమ దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యాలతో సంస్థకు బలమైన పునాదులను ఏర్పరచారు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. అధ్యాపకులు ,సహాయక సిబ్బంది తమ సేవల ద్వారా ఈ విద్యా వాతావరణాన్ని సమర్థవంతంగా కొనసాగించడంలో ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నారు.ఈ రోజు మనం గర్వంగా నిలబడి ఉన్న ఈ కళాశాల స్థాపనలో ఎందరిదో సమష్టి కృషి, అంకితభావం మరియు సేవాస్ఫూర్తి ఫలితమే అని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగుతూ, విద్య, విలువలు, సేవలతో మా కళాశాల మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, సాధించిన ఘనతకై విజయాలు జరుపుకోవా లన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వ్యవస్థాపక దినోత్సవాన్ని హోమ్ సైన్స్ విభాగం వారు నిర్వహించారు. కార్యక్రమం లోకళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సుశీల,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

