ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు
1 min read
హోళగుంద న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామంలో మాజీ సర్పంచ్ కురువ చామండిస్వారి ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కే. గిరి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పేద ప్రజలు, రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ప్రజలను తన కుటుంబ సభ్యుల్లా భావించి వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.అదే సంక్షేమ పాలనను మరింత ముందుకు తీసుకెళ్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం మరింత అంకితభావంతో పనిచేస్తున్నారని, తండ్రి వేసిన అడుగులను మరింత విస్తరించి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయకుడిగా నిలిచారని ఎస్.కే. గిరి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజా, ఈరన్న, విరాట్, జవీద్, జకీర్, శివ, షాషా, జిలాన్ తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళులు అర్పించారు.

