NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డోన్, ప్యాపిలి గోరుకల్లునీరు ట్రయల్ రన్ పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మండలంలోని యు.కొత్తపల్లి గ్రామ సమీపంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి వాటర్ గ్రిడ్ పైప్లైన్ ద్వారా డోన్ మరియు ప్యాపిలి మండలాలకు తాగునీటి సరఫరా కోసం నిర్వహిస్తున్న ట్రయల్ రన్‌ను బుధవారం డోన్ ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పైప్లైన్ ద్వారా నీటి సరఫరా ప్రక్రియను అధికారులతో కలిసి సమీక్షించి, ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా ప్రారంభం కావడంతో డోన్ మరియు ప్యాపిలి మండలాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే  తెలిపారు. ఈకార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *