NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గౌరీగోపాల్ హాస్పిట‌ల్‌ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పంద‌న‌

1 min read

ప‌లువురికి గుండె సంబంధిత స‌మ‌స్యలు గుర్తించిన వైద్యులు

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజల కోసం నిర్వ‌హించిన‌ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పంద‌న ల‌భించింద‌ని హాస్పిట‌ల్ యాజ‌మాన్యం ఓక ప్రక‌టనలో పేర్కొంది. ఈ వైద్య శిబిరానికి 180 మంది వచ్చి ఉచిత వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని, ఇందులో 13 మందికి గుండె సంబంధితర స‌మ‌స్య‌లు, స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జీకి సంబంధించి 9 మందికి, యూరాల‌జీకి సంబంధించి ఒక్కరికి స‌మ‌స్య ఉన్నట్లు బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. త‌క్షణ‌మే వైద్యులు వీరికి త‌గిన సూచ‌న‌లు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో రూ. 6 వేలు విలువగల ఆర్ బి ఎస్, ఈసీజీ, 2d ఎకో, ట్రేడ్మిల్ టెస్ట్, అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎక్స్ రే, సర్జికల్ గ్యాస్ట్రో కన్సల్టేషన్, యూరాలజీ కన్సల్టేషన్, కార్డియాలజీ కన్సల్టేషన్ ,డెంటల్ కన్సల్టేషన్ సేవలను ఉచితంగా అందజేశారు. రోగుల‌కు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సింధూర, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ గణేశ్వర రెడ్డి, యూరాలజీ వైద్యులు జీవి కృష్ణ,. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉచిత వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సింధూర మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు మే నెల 16వ తేదీ నుంచి ప్రతినెల 16వ తేదీ గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య సేవలు అందజేస్తున్నామని తెలియజేశారు. ప్రతినెల 16వ తేదీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలతో పాటు వైద్యుల సలహాలను స్వీకరించాలని ఆమె కోరారు.

About Author