NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు నియోజకవర్గ టిడిపి సన్నాహక సమావేశం విజయవంతం

1 min read

– ముఖ్యమంత్రి సభను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ఖరారు

ఆలూరు న్యూస్ నేడు : ఆస్పరి మండల కేంద్రంలో త్వరలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయడంపై ఆలూరు నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఆలూరు టిడిపి ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఆలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సభ ఏర్పాట్లు, ప్రజల భాగస్వామ్యం, కార్యకర్తల సమన్వయం, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సభను విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించడం, మండల స్థాయి నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జిలు సమన్వయంతో పనిచేయడం, ప్రతి కార్యకర్త తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని నాయకులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే విధంగా చారిత్రాత్మక విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ఈ సమావేశానికి జిల్లా, మండల, గ్రామ కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, దేవాలయ కమిటీ చైర్మన్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జిలు, కో-ఇన్‌ఛార్జిలు, పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు, అభిమానులు, టిడిపి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఐక్యత, ఉత్సాహంతో రాబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభను మరింత ఘన విజయంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *