NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి

1 min read

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – వైకుంఠం జ్యోతి

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరిశుభ్రమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండల కేంద్రంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని పెంచాలని పిలుపునిచ్చారు.ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, గ్రామాలు–పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని విస్తరించడం ద్వారా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించవచ్చని వైకుంఠం జ్యోతి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *