స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ్ శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలి
1 min read
పి ఆర్ సి వైస్ ప్రిన్సిపాల్ జివికె మల్లికార్జునరావు
ఇన్ఫర్మేషన్,ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ మరియు బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉండాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మండల కేంద్రాలలో స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ్ శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలి,డి పి ఆర్ సి వైస్ ప్రిన్సిపాల్, జివికె మల్లికార్జునరావు, నేటి నుండి జరుగుచున్న స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ్ శిక్షణ కార్యక్రమాలను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో సమర్థవంతంగా నిర్వహించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం వైస్ ప్రిన్సిపాల్, ఏలూరు జిల్లా జిల్లా పంచాయతీ అధికారి జి వి కె మల్లికార్జునరావు ఎమ్ పి డి ఓ లను కోరారు,స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్య సాధనకు కెపాసిటీ బిల్డింగ్ ప్రాథమికమైనదని,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఫలితాలను సాధించడానికి క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.పంచాయతీ అభివృద్ధి అధికారి గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలలో కమ్యూనిటీ యాజమాన్యాన్ని ప్రోత్సహించే విధంగా పనిచేయాలని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మరియు బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉండా లన్నారు.ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు ప్రజలందరికి చేరేలా చూడాలని ఆయన కోరారు.గ్రామాల్లో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు,ప్రతి గ్రామ పంచాయతీలో పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వము సవరించిన ఘన వ్యర్ధాల నిర్వహణ నియమాలు -2026 నందలి నియమాలు కచ్చితంగా పాటించాలని బల్క్ వేస్ట్ జనరేట్లను గుర్తించి ఘన వ్యర్ధాల నిర్వహణలో వారి ప్రమేయాన్ని నిర్ధారించేలా మండల స్థాయి శిక్షణా తరగతులలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు.


