కలలు కనండి,నిజం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషిచేయండి
1 min read
షైనింగు స్టార్స్ విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించి, సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
దేశభవిష్యత్తు యువత చేతిలో ఉంది,ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం వట్లూరు సి.ఆర్.రెడ్డి ఆడిటోరియంలో సోమవారం షైనింగు స్టార్స్ కార్యక్రమం అనంతరం అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో మమేకమై విద్యాభ్యాసం, లక్ష్యాలు, భవిషత్తు కార్యాచరణ గురించి జిల్లా కలెక్టరు ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కలలు కనండి, నిజం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషిచెయ్యాలని అన్నారు. దేశభవిష్యత్తు యువత చేతిలో ఉందని గ్రహించి ముందుకు అడుగులు వెయ్యాలని అన్నారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో, పట్టుదలతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలు అభివృద్ధి, మంచి విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, పెద్దలంటే గౌరవం, సమయపాలన అలవర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చునని హితబోధ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యాఅవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని తమకలలను సాకారం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు విజయమే జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, డిఐవో కె.యోహాను,పరీక్షలు నిర్వహణ సహాయ కమీషనరు ఆర్.ఆశ, తహశీల్దారు ఏ.కృష్ణజ్యోతి,ఎంఇఓ సబ్బితి నరసిమ్మూర్తి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



