సమ్మర్ స్టోరేజి ట్యాంక్ పూర్తిస్థాయిలో నింపుకునేందుకు వెసులుబాటు కల్పించాలి
1 min read
ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి విజ్ఞప్తి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా సరఫరా చేసేందుకుగాను దెందులూరు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ పూర్తిస్థాయిలో నింపుకునేందుకు వెసులుబాటు కల్పించేలా ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ కో అప్క్షన్ సభ్యులు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని మేయర్ నూర్జహాన్ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఏలూరు నగరపాలక సంస్థ నందు మంచినీటి సరఫరా చేయుటకు గాను కావలసిన నీటిని గోదావరి కాలువల నుండి పంపింగ్ చేసి 3000 మిలియన్ లీటర్ల సామర్థ్యము గల సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నందు నిలువ చేసి తదుపరి సదరు నీటిని ఏలూరు నగరము నందు గల 30MLD మరియు BMLD ఫిల్టరేషన్ ప్లాంటులకు పంపింగ్ చేసి, నీటిని శుద్ధి చేసి తదుపరి నగరములో గల అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ లకు సరఫరా చేయుట జరుగుచున్నదని, జూన్ నెల 1వ తేదీ నుండి గోదావరి కాలువలను నీటి విడుదల చేసినప్పటికీ . కాలువ యందు పూడికలు తొలగింపు పని పూర్తికాని కారణముగా జూన్, 10వ తేదీ వరకు దెందులూరు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ వద్దగల ఆఫీక్ ఛాంబర్ వరకు నీటి సరఫరా జరిగియుండలేదని . మరియు జూన్ 11 వ తేదీ నుండి నీటిని విడుదల చేసినప్పటికీ కాలువ నందు నీటి లెవెల్ 1.5 అడుగుల నుండి 2 అడుగుల లోపు మాత్రమే కాలువ ప్రవహించుచున్న కారణముగా చెరువును నింపుటకు పూర్తిస్థాయిలో మోటార్లను వినియోగించుటకు వీలుపడనందున పూర్తి స్థాయి చెరువు లెవెల్ 16 మీటర్లకు (3000 మిలియన్ లీటర్లు) గాను ప్రస్తుతము చెరువు లెవెల్ 8 మీటర్లు మాత్రమే ఉన్నందున చెరువు నందు నీరు 270 మిలియన్ లీటర్లు నిలువ ఉన్నదని మేయర్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. . ప్రస్తుతము ఉన్న నీటిని రోజువారి వాడకము 40 మిలియన్ లీటర్లు చొప్పున సుమారుగా 7 రోజులకు మాత్రమే సరిపోతాయని, .ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెంటనే స్పందించి నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు,మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు,చోడే వెంకటరత్నం,కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు,ఎర్రంశెట్టి నాగబాబు,కల్వకొల్లు సాంబ, బత్తిన విజయ్ కుమార్, మహమ్మద్ ఇలియాస్ పాషా, దేవరకొండ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.


