నెరణికి దాహార్తికి అండగా ఈబీజీ గోవింద్ గౌడ్
1 min read
– వరుసగా రెండో రోజు ట్యాంకర్లతో తాగునీటి సరఫరా
శాశ్వత పరిష్కారం వచ్చే వరకు సేవలు ఆగవు – నెరణికి గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చిన ఈబీజీ గోవింద్ గౌడ్
ప్రజల ఇబ్బందిని గుర్తించి వెంటనే స్పందించిన టీడీపీ సీనియర్ నాయకుడు
అధికారులతో పాటు ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి దృష్టికి సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి
హోళగుంద న్యూస్ నేడు: తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వరకు సేవలు కొనసాగుతాయి – వరుసగా రెండో రోజు నెరణికి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం నెరణికి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరుసగా రెండో రోజు కూడా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ టీడీపీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు.గ్రామ ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని, సమస్య తీవ్రతను గుర్తించిన ఈబీజీ గోవింద్ గౌడ్ వెంటనే స్పందించి వరుసగా రెండో రోజు కూడా తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి అవసరమైన తాగునీటిని గ్రామ ప్రజలకు అందించారు. ప్రజల కష్టకాలంలో అండగా నిలవడమే ప్రజా ప్రతినిధులు, నాయకుల అసలు బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, నెరణికి గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు అవసరమైనన్ని రోజులు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి దృష్టికి కూడా తీసుకెళ్లి, గ్రామానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.వరుసగా రెండో రోజు కూడా తాగునీటి ట్యాంకర్లను పంపించి గ్రామ ప్రజలకు అండగా నిలిచిన ఈబీజీ గోవింద్ గౌడ్‌కు నెరణికి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఇదే విధంగా ఎల్లప్పుడూ స్పందిస్తూ ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.


