జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన హోళగుంద జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు
1 min read
– రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు ఇద్దరి ఎంపిక
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల్లో మరోసారి తమ ప్రతిభను చాటారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో నిర్వహించిన అండర్-17 జిల్లా స్థాయి నెట్‌బాల్ టోర్నమెంట్లో పాఠశాల 10వ తరగతి ఎ, డి సెక్షన్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి మూడో స్థానం సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు:సి.హెచ్. అకిరా నందన్,కె. మణిశంకర్,వి. అభిరామ్,సి. వీరేష్,ఎన్. మహమ్మద్ సుఫియాన్,అబ్దుల్ హసీబ్,సి. సాగర్ వీరిలో వి. అభిరామ్, సి. వీరేష్ వచ్చే నెల విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అండర్-17 నెట్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు మరింత గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్ విద్యార్థులను అభినందించి, వారి కృషిని ప్రశంసిస్తూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేశారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి యూనుస్, పీడీ మేడమ్, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయం పాఠశాల, తల్లిదండ్రులు మరియు హోళగుంద మండల ప్రజలకు ఆనందాన్ని కలిగించింది.


