NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప్పలదడియలో’తల్లిపాల వారోత్సవాల’పై అవగాహన..

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని వీటిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఉప్పలదడియ,మాసపేట, కలమందలపాడు అంగన్వాడీ కార్యకర్తలు ఎల్ వనజ,డి భాగ్యమ్మ,డి నూర్జహాన్ భీ బాలింతలకు గర్భవతులకు తల్లిపాల వారోత్సవాల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపుముర్రుపాలు తప్పనిసరిగా ఇవ్వాలని”ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈనెల 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి.ఆరు నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం కూడా ఇవ్వాలి అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి మరియు గర్భవతి సమయంలో బిడ్డ సురక్షితంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు పోషకాహారం తదితర వాటి గురించి గర్భవతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు మరియు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *