బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి
1 min read
డీఎస్సీ అక్రమాలపై విచారణ చేయాలి
మిడుతూర్’రిలే నిరాహార దీక్ష’లో డాక్టర్ సుధీర్..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: డీఎస్సీ లీకేజీ మరియు అక్రమాలపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై వైసీపీ రిలే నిరాహార దీక్ష మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ముందుగా జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక్కడ ఎందుకు రాజీనామా చేయడం లేదని వారు మండిపడ్డారు.ఈ దీక్షకు హాజరైన డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ రైతులు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని కేసీ కెనాల్ కు నీళ్లు వదలాలని రైతుల పక్షాన మేము మచ్చుమర్రికి వెళ్తే మమ్మల్ని వెళ్ళనివ్వలేదని 14 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీక్ చేసి రిజిస్టర్లను తారుమారు చేసి మెరిట్ లిస్టు బయటకి ఇవ్వకుండా అనర్హులకు డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల రూ.లు ఇవ్వాలన్నారు.7 వ తేదీ ఈరోజు పగిడ్యాల,8న కొత్తపల్లి,9న పాములపాడు చివరగా 10వ తేదీన నందికొట్కూరు పట్టణంలో భారీ ర్యాలీగా చేపడుతున్నట్లు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని డాక్టర్ సుధీర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ నబి రసూల్, రమేష్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి,యాట ఓబులేష్,నాగ తులసి రెడ్డి,రాముడు,చిన్న రామచంద్రారెడ్డి,షరీఫ్, సాంబశివుడు,మాధురి గౌడ్,సాదిక్,రామలింగారెడ్డి, రామకృష్ణ,మర్రి రామేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.



