పత్తికొండ రోడ్డు విస్తరణ చేపట్టాలని సిపిఎం సంతకాల సేకరణ
1 min read
రోడ్డు విస్తరణ చేపట్టే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి. సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ పట్టణంలోచరోడ్డు విస్తరణ చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి దగ్గర ఆటో కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ హాజరై మాట్లాడారు. పత్తికొండ నియోజకవర్గానికి గత 30 సంవత్సరాల నుండి వస్తున్న నాయకులు కేవలం రోడ్డు విస్తరణ కార్యక్రమానికి వాగ్దానాలకే పరిమితమయ్యారని వాపోయారు. ఏ నాయకుడు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టకపోవడం పత్తికొండ పట్టణ ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ఈ కారణంగా పత్తికొండ పరిసర ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలో అనేక ప్రమాదాలు జరిగి బాటసారుల ప్రాణాలను బలి తీసుకుoదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 8వ తారీఖున వాహన కార్మికులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గుత్తి రోడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాలుగు స్తంభాల కూడలి దగ్గర ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే వాహనదారులు, ఆటో కార్మికులు పట్టణంలోని ఆటో కార్మికులు పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి, దస్తగిరి, వెంకటేశ్వర్లు, గోపాల్, రామాంజనేయులు,సురేంద్ర, ప్రజానాట్యమండలి నాయకులు కాశన్న, శివశంకర్, రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


