NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కనకదాసు ఆలయ గేటు నిర్మాణానికి రూ.21 వేల విరాళం

1 min read

కురువ కులదైవం ఆలయ అభివృద్ధికి టీడీపీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్, యువ నాయకులు రాజేంద్ర గౌడ్ సహకారం

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం హొళగుంద గ్రామంలో కురువల కులదైవంగా కొలిచే శ్రీ భక్త కనకదాసు స్వామి ఆలయానికి గేటు నిర్మాణం చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్, వారి తనయులు, యువ నాయకులు ఈబీజీ రాజేంద్ర గౌడ్ తమ వంతు బాధ్యతగా రూ.21,000 విరాళాన్ని అందజేశారు.కురువ సమాజానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన శ్రీ భక్త కనకదాసు స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా గేటు నిర్మాణ పనులు చేపట్టేందుకు కురువ సంఘం నాయకులు, కుల పెద్దలు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈబీజీ గోవింద్ గౌడ్, రాజేంద్ర గౌడ్‌లు ముందుకు వచ్చి తమవంతు సహకారంగా రూ.21 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ, శ్రీ భక్త కనకదాసు స్వామి ఆలయ అభివృద్ధికి ఈబీజీ గోవింద్ గౌడ్, రాజేంద్ర గౌడ్‌లు అందించిన విరాళం అభినందనీయమని అన్నారు. ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఆలయానికి గేటు నిర్మాణం పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.సమాజంలోని ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్న ఈబీజీ గోవింద్ గౌడ్, రాజేంద్ర గౌడ్‌లకు కురువ సంఘం నాయకులు, కుల పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కురువ సంఘం సీనియర్ నాయకులు డీసీ బజ్జన్న (గజ్జహల్లి), శేషప్ప (మాజీ సర్పంచ్, వందవాగలి), రాజన్న (వందవాగలి), భీమన్న (లింగంపల్లి), నాగరాజు (ఎం.డి. హళ్లి) తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి సహకారం అభినందనీయం

కురువ కులదైవమైన శ్రీ భక్త కనకదాసు స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, ప్రజలు సహకరించడం ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సంఘం నాయకులు తెలిపారు. భక్త కనకదాసు స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *