అర్జీలు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులుపై చర్యలు తప్పవు
1 min read
ఫిర్యాదుదారులు వద్ద స్నేహపూరిత వాతావరణంలో ఫిర్యాదులు స్వీకరించారు
దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరీసమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ (మీ కోసం) కార్యక్రమానికి జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి లు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ధరఖాస్తులు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించ వద్దని, కొంతమంది అధికారులు క్రింద స్థాయి సిబ్బంది దగ్గరకు పంపిస్తున్నారని, కొందరు నాపరిధి లోనిది కాదని సమాధానం చెబుతున్నారని ఇది క్షమించరాని నేరమని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్ళి వారితో ఫ్రెండ్లీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని అన్నారు. ధరఖాస్తులు పరిష్కారంలో అర్జీదారులు నుండి ఒక్కఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులుపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏలూరు మండలం మల్కాపురం గ్రామనివాసి జంపన వెంకటనారాయణ నాకు ఒక్క ఎకరం పొలం ఉంది పట్టాదారు పాసు పుస్తకం కూడా ఉంది, కాని ఆన్లైన్ లో 5 సెంట్లు భూమి మాత్రమే చూపిస్తుందని న్యాయం చెయ్యాలని అర్జీని సమర్పించారు, పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామానివాసి బాదావతు పార్వతి నేను ఐటిడిఏ ద్వారా వసతి వసతిగృహంలో 18 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, రాత్రిపూట విధులు నిర్వహించాలని, నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని, నాకు దివ్యాంగులు పిల్లలు ఉన్నారని న్యాయం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, తహశీల్దార్లు,డిప్యూటీ తహశీల్దార్లు,మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.


