పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్యకు ఈబీజీ గోవింద్ గౌడ్ అభినందనలు
1 min read
హోళగుంద న్యూస్ నేడు: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్యకు ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా, అలాగే కర్నూలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసలు, సత్కారం అందుకోవడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ అన్నారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొస్తున్న డీఎస్పీ వెంకట రామయ్యకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో లభించిన ఈ గౌరవం ఆయన అందిస్తున్న సేవలకు దక్కిన గుర్తింపుగా ఈబీజీ గోవింద్ గౌడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా పత్తికొండ కార్యాలయంలో డీఎస్పీ వెంకట రామయ్యను శాలువా, పూలహారంతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యారిస్వామి, దిడి నాగప్ప, టీడీపీ మైనారిటీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్, రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, సింధువలం మల్లి తదితరులు పాల్గొని డీఎస్పీ వెంకట రామయ్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.


