NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తపస్యలో అంగ రంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

1 min read

అలరించిన విద్యార్థిని,విద్యార్థుల వేషధార ణలు

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది  :  కలికిరి మండలం, రెడ్డివారి పల్లి నందు గల తపస్య విద్యా సంస్థలో  కరస్పాండెంట్ రామాంజులు నాయుడు, క్యాంపస్ ఇంచార్జ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు కృష్ణుడు,గోపికల వేషాలతో అలరించారు. పాఠశాల ఆవరణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. కొందరు విద్యార్థులు చిన్ని కృష్ణయ్యను తలుస్తూ నృత్య ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్  మాట్లాడుతూ భారతదేశం సర్వ మత సమ్మేళనమని సంస్కృతి,సాంప్రదాయాలు ఆచారాల ను ప్రతి ఒక్కరు ఆచరించాలని, ఆలోచన నైపుణ్యం పెంపొందించు కోవాలని,విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణ అలవర్చు కోవాలన్నారు.తమ పాఠశాలలో క్రమ శిక్షణ, నాణ్యమైన విద్యాబోధన  అందించడంతోపాటు జాతీయ పండుగలు,సాధారణ పర్వదినాలు నిర్వహించి విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తు న్నామన్నారు.అనంతరం శ్రీ కృష్ణుడికి ప్రీతీకరమైన అటుకుల ప్రసాదం ఉపాధ్యాయులు,విద్యార్థులకు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాధవి, ప్రేమలత, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థినీ,విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *