NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరావతి ఛాంపియన్‌షిప్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానం

1 min read

కోచ్ లు, క్రీడాకారులకు అభినందనీయం

రూ 4 లక్షలు ఫ్రైజ్ మనీ, 38 మంది క్రీడాకారులు 38 మెడల్స్ సాధించడం జిల్లాకు ఎంతో గర్వకారణం

విజయం సాధించిన కోచ్ లు, క్రీడాకారులు ఆత్మీయవిందులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొని వారిలో మరింత క్రీడా స్పూర్తినింపారు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరు క్యాంపుకార్యాలయంలో గురువారం రాత్రి అమరావతి ఛాంపియన్‌షిప్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిపిన కోచ్ లు,క్రీడాకారులకు ఆత్మీయవిందు సమావేశాన్ని నిర్వహించారు.38 మంది క్రీడాకారులకు 38  మెడల్స్, రూ 4 లక్షలు ప్రైజ్ మనీని, ట్రోఫీలను అందజేసి, అభినందించారు.

ఈ సందర్భంగా కోచ్ లు, క్రీడాకారులు తమ అనుభవాలను పంచుకున్నారు. వారితో జిల్లా కలెక్టరు సహబంతి భోజనం చేశారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్నలు పాల్గొన్నారు. ముందుగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏలూరు జిల్లాను సమష్టిగా రెండవ స్థానంలో నిలిపిన క్రీడాకారులు, వారి వెనుక ఉండి నడిపించిన కోచ్‌లు ఎంతో అభినందనీయులని జిల్లా కలెక్టరు  కొనియాడారు. ​క్రీడాస్ఫూర్తికి ఏలూరు జిల్లాను నిదర్శనంగా నిలపడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తి కలిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు నుంచి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, జిల్లా క్రీడాకారులు అంకితభావంతో రాణించి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జిల్లాకే గర్వకారణం అన్నారు. ​క్రీడాకారులు విజయాలు వెనుక కోచ్‌ల కఠోర శ్రమ, సరైన శిక్షణ అతి ముఖ్యం అని,  వారి మార్గదర్శకత్వం వల్లే ఈ ఘనత సాధ్యమైందని అన్నారు.​ క్రీడలకు జిల్లా యంత్రాంగం ప్రోత్సాహం ఇచ్చుటకు అన్నివేళలు సిద్ధంగా ఉందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం మద్దతుగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ప్రతిభ చాటేలా మరింత సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు.​యువత చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో రాణించడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం సాధించవచ్చని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లో ఏలూరు జిల్లాను ప్రథమ స్థానమే లక్ష్యంగా సాధన చెయ్యాలని క్రీడాకారులకు జిల్లా కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, సెట్ వెల్ సిఇవో కె.యస్. ప్రభాకర రావు, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ,ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బడేటి వెంట్రామయ్య, పిఇటి అసోసియేషన్ సెక్రటరీ, బాస్కెట్ బాల్ టీమ్ కోచ్  వాకా నాగరాజు, బాస్కెట్ బాల్ ఉమెన్ కోచ్ కె.మురళీకృష్ణ, తదితర కోచ్ లు, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ సిబ్బంది, క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *