NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

1 min read

ముఖ్యఅతిథిగా ఏలూరు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు

ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే బడేటి చంటికి ఏలూరు పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సోము సుధాకర్ పూలబొతో ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎమ్మెల్యే బడేటి చంటి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని అభినందించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *