NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురువును గౌరవంగా సత్కరించిన శిష్యులు  

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:   ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని పాఠాలు చెప్పి, విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువును శిష్యులు గౌరవంగా సత్కరించారు. స్థానిక శాంతి టాలెంట్ హై స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఎస్టియు రాష్ట్ర పూర్వ నాయకులు,సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొత్తపల్లె సత్యనారాయణను వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనీలు తన దగ్గర చదువుకున్న శిష్యులు ఆహ్వానించి పూలమాలలో దుశాలువాలతో ఘనంగా సన్మానించారు.  ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శ్రీదేవి, పాఠశాల ఉపాధ్యాయ బృందం , మన్రోపేట  బాయ్స్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, ఎస్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ వారి ఉపాధ్యాయ బృందం , ఏపీ ఎన్జీవో నాయకులు సాయిబాబా, రమేషు మొదలగు వారు,   శాంతి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయ బృందం శాలు వాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సత్యనారాయణ పత్తికొండ నియోజకవర్గం లో అనేకమంది విద్యార్థినీ విద్యార్థులను ఎన్నో విద్యా విలువలను నేర్పించిన ఖ్యాతి, ఘనత సత్యనారాయణ కే దక్కుతుందని వారన్నారు. అంకితభావంతో ఆదర్శవంతంగా ఉపాధ్యాయ వృత్తికి కట్టుబడి ఆ వృత్తికి న్యాయం చేసినటువంటి ఉపాధ్యాయుడు సత్యనారాయణ  అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్పందిస్తూ  మీ అందరి ప్రేమాభిమానాలు ఎల్లవేళలా నాకు ఇలాగే ఉండాలని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *