కలమందలపాడు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం
1 min read
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని కలమందలపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి-2 మల్లికార్జున నాయక్ హాజరయ్యారు.మార్చి నెలలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి మండలంలోననే మొదటి స్థానంలో నిలిచి త్రిబుల్ ఐటీ సీట్ సాధించారంటే ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.తర్వాత ఎస్ఎంసీ కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకుంటూ మంచిగా చదివితే మీరు అనుకున్న లక్ష్యాలను చేదిస్తారని అంతే కాకుండా పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు వస్తారని ఎంఈఓ విద్యార్థులకు సూచించారు. అంతేకాకుండా వివిధ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరిస్తూ కేక్ కట్ చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పాఠశాలల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


